వివక్ష కాదు భావ దరిద్రం
- Amarnadh Chavali
- Oct 31, 2019
- 1 min read
Updated: Jul 12, 2020
జనులంతా ఎఱిగె జన్మ రహస్యం!
జనని లేనిదె జన్మ అసంభవం!
మీసం మెలితిప్పేవారిది అమాయకత్వం!
సిగ్గు పడుతూ చిరునవ్వే అమ్మ తత్వం!
పురిటి నొప్పులతో పునర్జన్మ!
నేలమీద పడే కొత్త జన్మ!
భర్త, అత్త మామ, తల్లి తండ్రి, తోబుట్టువులు అంత అనే "ఆడపిల్లంటగా"!
జనులంతా ఎఱిగె జన్మ రహస్యం!
జనని లేనిదె జన్మ అసంభవం!
అయినా లింగ వివక్ష అర్ధం కానీ ఒక ప్రశ్న?
లింగ వివక్ష కాదు
భావ దరిద్రం!
*****************************************************************
నీ ప్రమేయం లేదు !
నీ అనుమతి లేదు !
కానీ నువ్వుండేది ఊరు బయట అంటరాని వీధిలో !
ఆ చూపులో చులకనతనం !
ఆ మాటలో లెక్కలేనితనం !
ఆ కులం లో పుట్టినందుకు అంత అహం:
వాడు పుట్టనందుకు అంత ధవుర్భాగ్యమా !
మనిషివి అని మరిచిపోయావు, మళ్ళి నాగరికత వయిపు నడువు ఓ మనిషి !
అది అంటరానితనం కాదు!
కుల వివక్ష కాదు !
భావ దరిద్రం !
*******************************************************************
コメント