top of page

వదిలి పోండి .....

Updated: Dec 3, 2023

ఊరూరా... ప్రతీ వీధిన .... అజ్ఞ్యానం అనే ఆకాశమంత పెద్ద గొడుగు కింద.... కుప్పల .... తెప్పలగా పడున్న ఈ ప్రజల్ని వదిలి.



మీ ప్రపంచానికి వెళ్లిపోండి అక్కడంతా రాజకీయ మేధావులే. ప్రజలుండరు !


సారా ప్యాకెట్ తో బిర్యానీ పొట్లంతో తమ భవిష్యత్తు ని తూకం వేసి ప్రజాస్వామ్యాన్ని పరమ బ్రష్ట్టు పట్టించిన... ఈ ప్రజల్ని వదిలి పోండి ...


మీ ప్రపంచానికి వెళ్లిపోండి అక్కడంతా రాజకీయ మేధావులే. ప్రజలుండరు !


కులం కుంపట్లో ... మతం మత్తులో కొట్టుకు చచ్చే.. ఈ ప్రజల్ని వదిలి పోండి .....


మీ ప్రపంచానికి వెళ్లిపోండి అక్కడంతా రాజకీయ మేధావులే. ప్రజలుండరు !


వివక్షనే పక్షిని స్వేచ్చగా దేశమంత తిరగనిచ్చే ఈ ప్రజల్ని వదిలి పోండి .....


సేవకులకె .... బానిసలుగా మారి అహం చచ్చిన ఈ ప్రజల్ని వదిలి పోండి .....


మీ ప్రపంచానికి వెళ్లిపోండి అక్కడంతా రాజకీయ మేధావులే ప్రజలుండరు !


చావా చచ్చి ... పౌరుషం విరిగి ... అజ్ఞ్యానంలో బ్రతుకుతున్న ఈ ప్రజల్ని వదిలి పోండి .....


అక్కడంత రాజకీయ మేధావులే. ప్రజలుండరు.

コメント


Post: Blog2_Post

+1 9199614645/+91 8555076739 (WhatsApp : +919742380410)

  • Facebook
  • Twitter
  • LinkedIn

©2019 by kathachebutha. Proudly created with Wix.com

bottom of page