కథ కాదిది.
- Amarnadh Chavali
- Dec 10, 2020
- 1 min read
మిర మిరలు గొలిపే నెమలి, తామరాకులతో నిండిన కోనేటి లో అడుగుపెట్టింది.
చంద్రుడి చల్లని వెన్నెల్లో, చిరు జల్లులు పడుతున్న సమయాన పురి విప్పి నాట్యమాడబోతుంటే చిమ్మ చీకటయే.
అది చంద్రుడి చాటునుంచి వచ్చిన చక్కటి నీడ కాదు...
రాబందు రెక్కలనుంచి వచ్చిన రాక్షస నీడ...
ఆ రాత్రే రాబందు, సుదుల్లాంటి ముక్కుతో, కత్తుల్లాంటి గోళ్ళతో నెమలికి నరకయాతనను పరిచయం చేసి, నెమలిని నేలరాల్చింది. తెల్లటి నెమలి రక్తపు రంగైపోయింది.
విచారణ చేయటానికి వచ్చిన ఎలుబంటి, రాబందు రాక్షసతత్వాన్ని చూసి, తోడేలు తాత తప్పించుకోలేక రాబందుని కాపాడటంకోసం సింహం అనుమతి పొంది ఒక కోతికి ఉచ్చులోకి ఇరికించింది.
ఉచ్చు తెలియని కోతి ఎలుగుబంటి బలానికి తోడేలు ఎత్తులకి బయపడి నేరం మీదేసుకుంది, జైలుపాలయ్యింది.

Comments