top of page

నా లో న ....

కనికరం కాలానికి. కన్నీళ్ల వర్షం కళ్ళకి. కోరిక రెక్కలతో వీచే వెన్నెల ఉండవు.

ఆ విశాల నిశీధి లో విరిగిపోయాను. రాలిపోయాను. కాలిపోయాను. గాలినై. దూళినై. నిప్పునై.

అంతా నేనై ఉద్భవించాను. ఉదయించాను. వెలుతురు లేని విశ్వం లో విహరించాను ఒక ఉల్కనై.

నలుపు రంగు పులుముకొని ఉరకలేశాను. చీకటి జాడ వెతుకుతున్న నిప్పు కణమై.

నేను వేసిన అడుగులలో ఎవరి జాడ లేదు. నేను కన్న కలలు ఏ పుస్తం లో రాయలేదు. నేను ఊహించిన ప్రపంచానికి ఏ నమూనా లేదు.

నాదొక కొత్త ప్రపంచం. నా ఊహ లోకం లో ప్రతి ఇటుక ఒక కలే.

అవును నేను ఒక విశ్వకృతినై వికసించాను. వీధి దీపాలు చుక్కల కాంతులు నా కధ కథనాలు బౌండరీలు. పాలపుంతలు బ్లాక్హోల్స్ నా హీరో విలన్లు. మాగ్నెటర్స్ అన్ని నా హీరోయిన్లు. గ్రహాలు ఉపగ్రహాలు నా ఆర్టిస్టులు. ఆల్ఫా బీటా గామా రేసులు నా పాటలు. రాళ్లు రప్పలు ఆస్ట్రోయిడ్లు అంతా నా ప్రేక్షకులు.

నేను ప్రతి గడియ ఉదయిస్తాను. ఉదయిస్తూ ఉండిపోతాను. ఉండిపోతూ అలసిపోతాను. అలసిపోతూ అనుభవిస్తాను.

అంతర్ముఖాన్ని. అన్వేషనికి నేనే ఆరంభాన్ని.

విశ్వాన్ని. నిరంతరం ప్రయాణించే సమయాన్ని.

విధ్వంసాన్ని. మరో సృష్టికి పరితపించే వినాశనాన్ని.

విశ్వానికి నీడనిచ్చే వృక్షాన్ని. విప్లవాన్ని. అజ్ఞ్యానాన్ని తరిమి కొట్టే మధ్యాన్నపు కిరణాన్ని.

నాగలిని. భూమి కొత్త చర్మాన్ని ఇచ్చే కోస్మెటిక్ సర్జన్నీ. వసంతాన్ని. కోకిల తొలి కూత విన్న పువ్వుని. ఆకలిని. స్వేచ్ఛ వాయువు వీస్తున్న పిల్ల గాలిని.

నిజమే. జీవితం పొడుగాటి నిచ్చెన. గమ్యం చావు వైపుకి నడిచే వంటరి ధారి. తోడెవరు లెరు. రారు. నీ చావు నువ్వే చావాలి.

ఏనుగు కుంభస్థలం లా. సింహం గాండ్రిమ్పు లా. పర్వతం ఎత్తుల. సముద్రపు లోతుల. కోయిల పాటల. నిశ్చలమైన ఆకాశం లా.

కలాన్ని. రాసిన రాతని గీసిన గీతని. చెరపలేని విధిని. అక్షరాన్ని. అంతులేని ఆలోచనలకి నేనే ఆర్యుడ్ని.


Comments


Post: Blog2_Post

+1 9199614645/+91 8555076739 (WhatsApp : +919742380410)

  • Facebook
  • Twitter
  • LinkedIn

©2019 by kathachebutha. Proudly created with Wix.com

bottom of page