భగ్న ప్రేమికుడు....
- Amarnadh Chavali
- Dec 10, 2020
- 1 min read
కరుడుగట్టిన కసాయి హృదయం కన్నా కఠినం నీ మనస్సు!
మూర్ఖుడి మాటకన్న బాధ నీ మౌనం!
అసహ్యం అసూయా పడేలా నీ చూపు!
ఐహిక సుఖాలే సంతోషం అని!
నన్ను నమ్మించేలా, నిలువెత్తు నిదర్శనాలతో నాకు దూరమయ్యావు
కంటికి కలలే దూరమై!
కన్నీటి ధారాలే ఎక్కువైతే!
పుడమిని తాకే ప్రతొక్క కన్నీటి బొట్టు, ఎంత త్వరగా ఇంకిపోతుందో అలా నా మనస్సు నా గతం లో ఇంకిపోయింది!
ఇంద్రియ లోలుడైన మనస్సు, గతం లో ఇంకితే!
మళ్ళి నువ్వొచ్చిన నా మనస్సు నా దగ్గర లేదు నీకందించే అందుకు!

Comments