పక్కకు చూడకు ఓ మడిషి.
- Amarnadh Chavali
- May 10, 2023
- 1 min read

పక్కకు చూడకు ఓ మడిషి.
వేదనకు గురికాగలవ్.
పక్కకు చూడకు ఓ మడిషి. గర్వం తో తృప్తి పడగలవ్.
ఊరంతా నీడ ఇవ్వగలిగిన మర్రి చెట్టు పక్కనే ఓ చిన్న యాప చెట్టు కూడా ఉంటుంది.
వందేకరాల ఓరి పంట గట్టున ఓ రామ్ములక్కాయ కాస్తుంది.
పక్కకు చూడకు ఓ మడిషి. నిన్ను నీలో చూసుకో అప్పుడప్పుడు ముందుకి చూడు నీకో ఆశ కలుగుతుంది.
పక్కకు చూడకు ఓ మడిషి. నిన్ను నీలో దాచుకొ అప్పుడప్పుడు వెనక్కి చూడు నీ గత స్మృతి నీకో గుర్తు.
పక్కకు చూడకు ఓ మడిషి.
Comentarios