నల్లటి మబ్బు
- Amarnadh Chavali
- Apr 7
- 1 min read
నల్లటి మబ్బు :
Zoom IN లో చూస్తే నలుపు రంగు మనం ఇక్కడి నుంచే తెచ్చుకున్నాం అనిపిస్తుంది. అందం దాని లక్షణం.
కొంత సేపు అలానే చూస్తే ఏదో మైకం. నల్ల మనసులు అన్ని దాన్ని చూసి జుట్టు విరబుసుకున్న దెయ్యం అన్నాయి. ఊరి బయట వేలాడే ఊడల మర్రిచెట్టు అన్నాయి. కొన్ని లక్షల అత్మల ఘోషలన్నాయ్యి.
వాళ్ళందరి కోసం నేనొక ఉరుముని వదిలాను. ఆ జ్యోతి కి ఆ నల్లని మనసులు ఉవిళ్ళురాయి. దెయ్యాలు కాస్త నల్ల కాటుక పెట్టుకున్న అందమైన కను రెమ్మల్లనాయి. ఊడల మర్రి కాస్త పండోరా ప్రపంచం లో అద్భుతమైన చెట్టు అన్నాయి. ఆత్మ ఘోషంత కల్యాణి రాగం అయ్యింది.
ఆ మెరుపు ఎక్కువ కాలం ఉండదు లే అలా వచ్చి ఇలా పోయే తుమ్ము లా. మళ్ళీ వెత్తొక్కోసాగారు.
అభరణం ఆ మెరుపు కొందరికి. సమయం ఓ క్షణం
సంతోషం ఒక యుగం. మనసు చూచే ఆ తన్మయత్వం అందమైన అమ్మాయి ప్రేమ గా చూసిన ఓ చూపంత. బాగుంది లే అనే ఫీలింగ్ ఎప్పటికీ అలానే గుర్తుండిపోతుంది.
కళ్ళు మూసుకొని కొన్ని సార్లు మనం అంతా ఆనందాన్ని వేతుకుంటాం. అప్పుడోకసారి నల్ల మబ్బు మన కళ్ళ ముందు మెదులుతుంది. మర్చిపోకు సుమ మధ్య వచ్చే మెరుపే దాని నిజమైన సౌందర్యం అది మన మనస్సు లో నే ఉంటుంది. నీకు కావలసినప్పుడు వస్తుంది. వద్ధన్నప్పుడు పోతుంది. దాన్ని తుమ్మంటావ లేక అందమైన అమ్మాయి చూసిన చూపంటావ?
నల్లటి మబ్బు.
Comments