పార్టనర్
- Amarnadh Chavali
- Apr 7
- 1 min read
పార్టనర్ :
తానొస్తు వస్తూ ఏడారంత ఇసుకని తెచ్చింది.
నిస్ప్రుహలో ఉన్న నాకు ఆ వెలితి మరింత వ్యగ్రతని పెంచింది.
నా గతం అంత పూల తోట. ప్రకృతి ఓడిలో ఎన్నో రాత్రుళ్ళు సేద తీరాను. గతం తాలూకు మధుర క్షణాలు నన్ను వెంటాడుతున్నాయి. ఎంత వేతకిన ఎడారి లో పూల మొక్క కూడా కనపడదు.
ప్రయాణం ఆపలేక నడుస్తున్న నాకు దిగ్భ్రాంతి కలిగింది. ఎడారాంత సముద్రం అయ్యింది. దప్పిక తీరాటానికి నాకు ఉప్పు దొరికిన దప్పిక తీరలేదు.
నా గతం అంత పూల తోట. ప్రకృతి ఓడిలో ఎన్నో రాత్రుళ్ళు సేద తీరాను. గతం తాలూకు మధుర క్షణాలు నన్ను వెంటాడుతున్నాయి. ఎంత వేతకిన సముద్రం లో పూల మొక్క కూడా కనపడదు.
ప్రయాణం ఆపలేక నావిస్తున్న నాకు దిగ్భ్రాంతి కలిగింది. సముద్రం అంత హటాత్తుగా ఆకాశం లా మారిపోయింది. ఆ విశ్వం లో నేనొక క్రిమి లా కనిపించాను.
నా గతం అంత పూల తోట. ప్రకృతి ఓడిలో ఎన్నో రాత్రుళ్ళు సేద తీరాను. గతం తాలూకు మధుర క్షణాలు నన్ను వెంటాడుతున్నాయి. ఎంత వేతకిన ఆకాశం లో పూల మొక్క కూడా కనపడదు.
ప్రయాణం ఆపలేక గాల్లో తెలుతున్న నాకు దిగ్భ్రాంతి కలిగింది. ఓ గడియ స్పృహ కోల్పోయిన నాకు తెలివొచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే అది స్వర్గం అయ్యింది.
ఆ స్వర్గం అంత తానే. తానే ఓ స్వర్గదామమయ్యింది.
గతం తాలూకు మధుర క్షణాలు ఇక నన్ను వెంటాడలేదు.
నా గతం అంత స్వర్గం ఇక ఏ విపత్తు నా గతాన్ని మార్చలేదు.
Comments