ప్లాస్టిక్ పరమాణ్ణం
- Amarnadh Chavali
- Oct 31, 2019
- 1 min read
Updated: Jul 12, 2020
నగ నట్రా అమ్మి విత్తనాలు కొని,
తొలకరి సమయం దగ్గర పడుతుందని, మండుటెండలో కూడా నేల తల్లిని సిద్ధం చేసి,
తొలకరి పడ్డ తరువాత రోజు ఆదరాబాదరాగా మొలకలు నాటి,
రేయింబవళ్లు పంపుసెట్టు దగ్గర పడిగాపులు కాసి, పొలానికి నీరు పెట్టి,
పసిపిల్లోడికి పాలు పట్టించినట్టుగా ఎరువులేసి,
చీడ పురుగులు పట్టకుండా పోషకాహారాలేసి,
తొంబై రోజులు కంటి పాపల కాపాడుకొని,
కోతకోసె సమయానికి. తెచ్చిన విత్తనాలు నకిలీ అని తెలిసి, భూసారం తగ్గిపోయిందని బాధపడి,
ఎరువులన్ని మోయలేనంత మోసం చేసాయి అని క్షోభించి భార్య బిడ్డలని తల్లి తండ్రులని భవిష్యత్తుని తలుచుకొని బాధపడి అదే పొలం లో ఉరిపోసుకొని చనిపోదాం అని అనుకుంటున్నావేమో రైతన్న!!!!!
అక్కర్లేదు!
నిజాంగా అక్కర్లేదు!!
నీ బాధలన్నీ తీరిపోయే కాలం వచ్చేసింది!!!
నిజంగా వచ్చేసింది!!!!
ఆడేవాడో మన నెత్తి మీదుంటాడంట, భూమికి మూడడుగులుఉంటాడంట, బుర్ర నిండా పనికిమాలిన ఆలోచనలంట. ఎదో యంత్రం కనుకున్నాడంట. పనికిరాని ప్లాస్టిక్ తో పరమాణ్ణం చేస్తున్నాడంట.
నువ్వుకూడా ఆ పొట్టోడి దగ్గర ఫ్రాంచైజ్ తీసుకొని మనోళ్ళందిరికి ప్లాస్టిక్ పరమాణ్ణం పెట్టెయ్. ఉరి పోసుకునే నువ్వు ఊపిరి పోసుకుంటావ్.
Commentaires