పంచేంద్రియాలు
- Amarnadh Chavali
- Oct 27, 2019
- 1 min read
Updated: Dec 10, 2020
తనని తాను చూడలేని కన్ను లోకాన్ని చూపిస్తుంది తనని తాను చూడలేని కన్ను నిజముగా లోకాన్ని చూపించగలదా?
శ్వాస దేనికోసం తన కోసం కాదు, నిరంతర ప్రక్రియలో ఎటువంటి అనుభవం చెందని దాని తత్వం అమోఘం రుచేంద్రియుడా!
షడ్రుచులను ఆకళింపు చేసుకున్న నీకు ఒక్క మెతుకు మింగే భాగ్యం ఎన్నడూ ?
విన్నది విన్నట్టుగా ఎటు పోతుంది, ఈ దరినుంచి ఆ దరికా ఆ దరినుంచి ఈ దరికా? ధారేరగని నీ ప్రయాణం చేరుకుంటుంది నిజమైన గమ్యం లేని అగమ్యం.
అద్భుతమైన నీ స్పర్శకు, ప్రతిస్పర్శ లేనిదే నిరుపయోగం. తనని తాను అనుభవాన్తర్యం చెందని ఏ ఇంద్రియమైన తనని ధాటి వేరే దాన్ని అనుభవింప చేయగలదా ?

పని చేసేవాటికి దేని బెడద లేదు పనికిమాలిన మనసుకే ఇంద్రియ బెడద.
Comments