నాయకుడు కావలెను...
- Amarnadh Chavali
- Dec 10, 2020
- 1 min read
ధవర్జన్యం, దారుణం, మోసం, అ"సమానం", మదాన్ధకారం, నియంతృత్వం. అధికార దాహం.
పెట్రేగినప్పుడు, హద్దులు ధాటినప్పుడు.
చూసి చూసి. విసిగిపోయి. తప్పక తిప్పలు పడి.

వేదన చెంది, వేలమంది రోదన అనుభవించి, వాళ్ళ చేతగాని తనానికి జాలి పడి.
అంతర్మదనం గావించి, అమృతం ల ఉద్భవించి, తాడో పేడో తేల్చుకుందాం అని
తెగించి, అన్ని ఉన్న సన్యాసి లా వాడు మారితే.
వాడి ఒక్క అడుగు కొన్ని వందలమంది ప్రయాణం.
వాడి ఒక్క హుంకారం కొన్ని వందలమంది చేసే శబ్ద భేరి.
వాడి ఒక్క నిర్ణయం జనులందరి ఆమోదం.
వాడి త్యాగం వేలమందికి ఆనందం.
చివరికి. వాడు. వాడు కాదు. వాడి జీవితం వాడిది కాదు. వాడి జీవితం మనందరి భవిష్యత్తు.
Comments