నాకు కోపం వస్తుంది
- Amarnadh Chavali
- Oct 23, 2019
- 1 min read
Updated: Jul 12, 2020
నాకు కోపం వస్తుంది ... ఏమి చేయలేపోతున్నానని
నాకు కోపం వస్తుంది... ఎంతో మంది చనిపోతుంటే చూస్తుండిపోతున్నానని
నాకు కోపం వస్తుంది... ఒక్కరినైనా కాపాడలేకపోతున్నానని
నాకు కోపం వస్తుంది.... ఒక సమాధానం లేని ప్రశ్న ఇంత ఉన్మాదానికి కారణమైందని
నాకు కోపం వస్తుంది.... నా సోదరి సోదరులు చావటానికి బ్రతుకుతుంటే
నాకు కోపం వస్తుంది... నాశనానికి ఇన్ని దారులు ఉన్నందుకు
నాకు కోపం వస్తుంది.... మానవ మృగాలా శవాల శకం మొదలైనందుకు
నాకు కోపం వస్తుంది... ఊహకందని ఉన్మాదం విచ్చలవిడి అవుతుంటే
నాకు కోపం వస్తుంది.. ఊపిరాగిపోతున్న ఊరుకొని పైశాచికత్వం చూస్తుంటే
నాకు కోపం వస్తుంది....మారణాయుధాలతో మారుమోగిపోతున్న మారణహోమన్నీ ఆపలేకపోతుంటే
నాకు కోపం వస్తుంది....పారి"పో"టానికి ఐదు గంటలు మరి బ్రతకటానికి? ఖచ్చితంగా పోయే ప్రాణానికి డిస్కౌంట్స్ ఇస్తుంటే
నాకు కోపం వస్తుంది....పరిష్కారం లేని సమస్య అవ్వచ్చు గాక కానీ పయనించే మార్గం ఇది కాదు తెలుసుకోలేకపోతుంటే
Comments