దీని దుంప తెగ...
- Amarnadh Chavali
- Oct 19, 2019
- 1 min read
Updated: Dec 10, 2020
దీని దుంప తెగ, మండుటెండలోనూ మైమరిచిపోయే తన్మయత్వం.
దీని దుంప తెగ, ఎముకలు కొరికే చలిలోనూ ఏంటో ఆ వెర్రితనం.
దీని దుంప తెగ, తుఫాను భూమిని తూట్లు పొడుస్తున్న పట్టని వైనం.
దీని దుంప తెగ, పక్కింటోడి ప్రాణం పోయిన పట్టనివ్వదు.
దీని దుంప తెగ, నిజంగా నేలని చూసి నడవమనే సామెతని నిజంగా నిజం చేసింది.
దీని దుంప తెగ, బద్ధకానికే అందరిని భామర్ధులని చేసింది.
దీని దుంప తెగ, పని పాట లేనోడ్ని కూడా యమా బిజీగా మార్చింది.
దీని దుంప తెగ, పనికిమాలిన పనులు ఎంత బాగా చేయచ్చో పూస గుచ్చినట్టు చెప్పుద్ది.
ధుమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అతిగా సెల్ ఫోన్ వాడకం ప్రాణానికే ప్రమాదం.

Comments