తలకో సరుకు. తలకో సురుకు.
- Amarnadh Chavali
- Jul 6, 2023
- 1 min read
తలకో సరుకు. తలకో సురుకు.తెలివైనోడు ఇప్పి ఎళ్ళిపోతే. తెలిసాక చుట్టూ ఎవడు చూసాడా అని ఆకులతో కప్పుకోటాం తప్ప తప్పుకోవటం కుధ్రదు.
అందుకే తీసుకోక అర్ధం కాదు అదొక వ్యర్థం అని. అడక్కు దానంత అనవసరం ఆ అవసరానికి ఉండదని.
పూలు, పళ్ళు, రాళ్లు. విసరగలిగితే. విసురులు. తిరిగి విసరగలిగితే త్యాగాలు. ప్రేమలు. ఆప్యాయతలు. అనురాగలు.
వచ్చి. వడ్డించేవాడు. కూర్చొని. తినిబోయేవాడు. ముఖాలు కూడా గుర్తు పట్టర్రు. ఆఖరి మెతుకుల. ఖర్చుబెట్టిన పటేళ్ల మధ్య మాత్రం పెద్ద పోరు.
ఊరికే ఉండు పోయేదేం లేదు. నోరు మేదీపావో అదొక రొచ్చు. దానికేమో పెద్ద వర్షం పడాలి లేదంటే కనీసం ఓ చంటొడు ఓ లోటా ఉచ్ఛయైన పోయాలి.
అర్ధం కాకా తల బాదుకోకు అన్ని తెలిసిన అక్షరాలే. తికమక పడకు అన్ని అనుభవించిన అనుబూతులే.

Comments