జా"గో"గు
- Amarnadh Chavali
- Oct 31, 2019
- 1 min read
Updated: Jul 12, 2020
శ్వాస ఉన్ననంత కాలం ఎలాస్టిక్లాగా సాగే ఆశ
ఎన్ని మడతలేసిన మడవని నాలుక
కనిపించెవన్నీ నిజాలు, మధ్య మధ్యలో ఫిలాసఫీలు
పంచ్ డైలాగ్లు, పబ్లిక్ స్టన్ట్లు
స్టన్ట్లు అంటే వాళ్ళు చెసేవి కాదు. వాళ్ళు చెప్పేవి మనం చుసేవి
చెప్పిందే చెప్పి, మళ్ళి మళ్ళి చెప్పి, అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం చేసే మాధ్యమమ్
చుసేవాడికి చూడదగ్గ చూడుడు
నిజానికి అబద్దానికి మధ్య గందరగోళం
చెప్పిందానికి చెసెదానికి మధ్య వ్యత్యాసం
మానిఫెస్ట్లో లేని "మాన్" ఫెస్టివల్స్
మానిఫెస్ట్లో ఉన్నవాటికి మోనిటైజేషన్లు
పరిపాలన లేని వ్యవస్థకి ఎన్నికలెందుకు, మెరిట్ సిస్టం పెట్టి సరిగ్గా ఎన్నుకోన్నందుకు జనాలని బాయ్కాట్ చేసేయండి మా ప్రియతమా నాయకుల్లార్రా
Comments