చిత్ర గుప్తా!!!
- Amarnadh Chavali
- Oct 18, 2019
- 1 min read
Updated: Dec 10, 2020
చిత్రం గా కూర్చొని, గుప్తం గా ఎదో చేస్తున్నాడు అనుకుంటున్నారా....
బ్రహ్మ దేవుడు గీసిన గీతను నువ్వు ఎలా మారుస్తున్నావో తొంగి తొంగి చూస్తున్నాడు..
రాగి పలక మీద సువర్ణ కలంతో..రత్నాలాంటి నీ కర్మలు నీకు తెలియని నీ డైరీ లోనే రాస్తున్నాడు..
వెతికి చదవగలిగితే కొన్ని సరిచేసుకోవచ్చు మరికొన్ని మునుముందు మార్చుకోవచ్చు...
భూత భవిష్యత్ వర్తమానాలు కర్మానుష్ఠానాలే, లెక్కవేసేది మాత్రం చిత్ర గుప్తుడే...

Comments