కర్మ భూమి కాదు ఇది ఖర్మ భూమి
- Amarnadh Chavali
- Oct 23, 2019
- 1 min read
Updated: Jul 12, 2020
కర్మ భూమి కాదు ఇది ఖర్మ భూమి
రాముడు పుట్టిన భూమి కాదు ఇది
రావణులు ఏలుతున్న రావణ కాష్టం ఇది
ఇది అన్యాయం అంటే నీదెకులం అని అడుగుతారు
ఇది దౌర్జన్యం అంటే నీదెమతం అని అడుగుతారు
వేదాలు పుట్టిన భూమి కాదు ఇది
వెధవలు పుట్టిన వెధవ భూమి ఇది
కులాలు పుట్టిన భూమి కాదు ఇది
కుల గజ్జి పిచ్చి పిచ్చి గా పాకిన పనికిమాలిన భూమి ఇది
నిస్స్వార్థం గా ముందుకొస్తే. ముంచేస్తాడు అంటారు
దోచుకోటానికి వస్తే కలిసి పంచుకుందాం అంటారు
ధర్మ భూమి కాదు ఇది
అధర్మ భూమి ఇది
సరస్వతి నమస్తుభ్యం నుంచి సరస్వతి ధవుఁర్భాగ్యం వరుకు
చదవుకో నుంచి చదువు కొనుక్కో వరుకు
అమ్మతత్వం నుంచి కామతత్వం వరుకు
సాయం నుంచి కసాయితనం వరకు
రంకు ల కోసం రక్తం చూసే వరుకు
ప్రేమ నుంచి పైశాచికత్వం వరుకు
పూజ నుంచి పోరంబోకు పనులు వరుకు
తప్పొప్పులు ఒప్పుకోటం నుంచి సమర్ధించుకోటం వరుకు
మనం మారం మనం మారం మనం మారం
Comments