ఓ నేస్తం!
- Amarnadh Chavali
- May 10, 2023
- 1 min read
Updated: Dec 3, 2023

ఓ నేస్తం!
పరుగులు తియ్యకు అడుగులు మర్చిపోగలవ్. అవసరాలు తీర్చకు తిరిగి బాధపడగలవ్. సొంతం అనుకోకు విడపోవాల్సివచ్చినప్పుడు నిజాన్ని ఒప్పుకోలేవ్. ఓ నేస్తం! రెండు సముద్రాలు ఎప్పుడు కలవ్. రెండు పాద ముద్రలు ఎపుడు ఒకటిలా ఉండవు. రెండు అలలు ఒకేసారి తీరాన్ని చేరవ్. మారేలా! రెండు సముద్రాలు కలిసేదెలా? మారేలా! రెండు పాదాల ఒకలా పలికేదెలా? మారేలా! రెండు అలలు ఒకేలా ఇంకేదెలా? రా నేస్తం! స్నేహం తాలూకు నిప్పుకణికిని నీలో నింపుతాను అది నిన్ను ఒక్క మారు కూడా అవసరం తాలూకు మంటల్లో నిన్ను నెట్టదు. రా నేస్తం! స్నేహం తాలూకు మాధుర్యాన్ని నీలో నింపుతాను అది నికు ఒక్క మారు కూడా చెదు గా అనిపించదు. సాధ్యాసధ్యలు పక్కన పెట్టి రా నేస్తం కలిసి అడుగులు వేసి ఒక దారి చూపెడదాం.
Comments