ఎవడాడు
- Amarnadh Chavali
- Oct 30, 2019
- 1 min read
Updated: Jul 12, 2020
ఉన్నాడంటావా! ఉన్నాడంటే ఉలుకెక్కువ
లేడంటావా! లేడంటే లొల్లేక్కువ
బదులే లేని ప్రశ్నకి ఉనికెక్కువ
ప్రశ్నకి బదులు
ప్రేమకి త్యాగం
సహాయానికి కృతజ్ఞత
మరణానికి జననం
వాడెవడో ఉన్నాడు నా ప్రశ్నకి బదులిస్తాడు
వాడెవడో ఉన్నాడు నా ప్రేమకి త్యాగాన్ని ఇస్తాడు
వాడెవడో ఉన్నాడు నా సహాయానికి కృతజ్ఞత చూపిస్తాడు
వాడెవడో ఉన్నాడు నే మరణించాక మళ్ళి జన్మ ఇస్తాడు
నీ క్రియకి వాడేందుకు కర్మణిస్తాడు
నీదంటూ ఏది లేనిచోట మళ్ళి నీకు ప్రశ్న ఎందుకు
నువ్వే ఒక ప్రశ్న, ఒక ప్రశ్న ఇంకో ప్రశ్నని అడుగుతుంది
ప్రశ్నకి బదులు కేవలం బదులుకి ఆరంభం మాత్రమే అదే బదులు కాదు
Comments