ఆనందం, అనుభూతి
- Amarnadh Chavali
- Oct 24, 2019
- 1 min read
Updated: Jul 12, 2020
సాయంత్రం ఒంటరిగా నడిస్తే వచ్చే ఆలోచనలు
భోజనం తరువాత చంద్రుడిని చూసినప్పుడు గుర్తొచ్చే జ్ఞపకాలు
పచ్చని పైరును చూస్తే వచ్చే ఆనందం
నిర్మలమైన సముద్రాన్ని చూసాక వచ్చే ఆహ్లాదం
ఎంతసేపు చూసిన వదలబుద్ధి కానీ ఏనుగు తొండం
నక్షత్రాలని లెక్కపెడుతూ వచ్చే నిద్ర
అరుగు మీద కూర్చొని చెప్పే ముచ్చట్లు
చెరువు గట్టు దగ్గరా ఈత
చల్లటి ఇసుకతో కట్టిన గుళ్ళు
బడి ఎగొట్టి ఆడిన ఆటలు
దొంగతనం చేసి తిన్న చిరుతిళ్ళు
ఎన్ని సార్లు గుర్తుచేసుకున్న అదే ఆనందం అదే అనుభూతి
Comments