అందరికి దీపావళి శుభాకాంక్షలు
- Amarnadh Chavali
- Oct 18, 2019
- 1 min read
Updated: Dec 10, 2020
అప్పు తరువాత వచ్చే ఆదాయానికి
ఓటమి తరువాత వచ్చే అవకాశానికి
విలువెక్కువ
వేగం లో పొరపాట్లు జరగొచ్చు
కానీ కంగారులో పొరపాట్లే జరుగుతాయి
అర్ధం చేసుకోవాలి లేదంటే నేర్చుకోవాలి
భరిస్తున్నావ్ అంటే ఏదొక రోజు బద్దలైపోతుంది
జ్ఞ్యానానికి అజ్ఞ్యానానికి అ"క్షరమే" తేడా
కానీ వాటి మధ్య వ్యత్యాసం అ"నంతం"
దేనికోసమైన ఎక్కడో వెతకటం అనవసరం
నీలో లేనిదీ ఇంకెక్కడా ఉండదు అని తెలుసుకోవటం అవశ్యకం
వెలుతురిచ్చే ప్రతిదీ దీపమవ్వదు
అంతర్ముఖానా వెలిగే చిన్న జ్యోతి కొన్ని వేల దీపాలని వెలిగిస్తుంది
కుదిరితే మనమందరం ఒక్కో జ్యోతవ్వాలని కుదరకపోతే కనీసం ఒక్కో దీపం అవ్వాలని కోరుకుంటూ....
అందరికి దీపావళి శుభాకాంక్షలు.....

Comments