మరణం...
- Amarnadh Chavali
- Dec 10, 2020
- 1 min read
మరణం అనే రణం నుంచి బయటపడ్డ ఓ ప్రాణమా.
ఇదే నీకు నేను పలికే స్వాగతం.
బహుశా, స్వాగతం అంటే అవివేకమెమో.
ప్రాణానికి సృష్టి లేదు, అది ఎప్పుడు సృష్టింపబడలేదు.
దాని తత్వం చలనం.
చలనం ఉన్న ప్రాణాన్ని బంధించటం అవివేకం.
బహుశా అందుకేనేమో శరీరం అనే పదార్ధానికి మరణం పర్యాయం.
అస్థిరత్వమైన ప్రాణానికి స్థిరత్వం ఆపాదించటం అవివేకం.
కొంతవరుకు స్థిరత్వం ఉన్న శరీరానికి అస్థిరత్వం అనే ఆలోచన రాక్షసతత్వం.

Comments